తెలంగాణ సాహిత్య అకాడమి గురించి

తెలంగాణ రాష్ట్ర సాధనలో సాహిత్యం పాత్ర కీలకమైంది. తెలంగాణ సాహిత్య వికాసానికి విస్తృతంగా కవులను వెలుగులోకి తేవడానికి సాహిత్య అకాడమి ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు.

మే 02, 2017న తెలంగాణ సాహిత్య అకాడమి G.O.R.t. No. 344 ద్వారా పునరుద్ధరించబడింది.

అదే రోజున ప్రసిద్దకవి డా. నందిని సిధారెడ్డి గారిని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా G.O.R.t. No. 1033 ద్వారా నియమించడం జరిగింది.

తేది. 10.05.2017 రోజున తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణ సాహిత్య అకాడమి రవీంద్రభారతి ప్రాంగణంలోని కళాభవన్ లో ఏర్పాటైంది.

G.O.R.t. No. 660 ద్వారా డా. ఏనుగు నరసింహారెడ్డి గారిని, నవంబర్ 03, 2017న తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శిగా నియమించడం జరిగింది.

రిజిస్టేషన్ నెం.  787/2017 ద్వారా తెలంగాణ సాహిత్య అకాడమి  సంస్థగా నమోదైంది.

ఛాయా చిత్రాలు

దృశ్య మాలికలు

తాజా వార్తలు

నవలా స్రవంతి-10

తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతినెలా రెండవ శుక్రవారం నిర్వహించే నవలా స్రవంతి కార్యక్రమంలో భాగంగా తేది: 10.01.2020 రోజున నవలా స్రవంతి-09 లో సాహు, అల్లం…

Read More
నవల స్రవంతి -09

తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతినెలా రెండవ శుక్రవారం నిర్వహించే నవలా స్రవంతి కార్యక్రమంలో భాగంగా తేది: 13.12.2019 రోజున నవలా స్రవంతి-09 లో సాహు, అల్లం రాజయ్యల…

Read More